RRB NTPC & JE Recruitment 2025 | రైల్వేలో 11,429 ఉద్యోగాలు – అప్లయ్ చేశారా?

On: November 6, 2025
RRB NTPC & JE Recruitment 2025

RRB NTPC & JE Recruitment 2025 : ఇండియన్ రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. Railway Recruitment Boards (RRBs) ద్వారా రైల్వే వివిధ జోన్ లలో మొత్తం 11,429 ఖాళీల కోసం నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ నియామకాల్లో ఇంటర్ (10+2), డిగ్రీ, అలాగే డిప్లొమా / ఇంజినీరింగ్ చదివినవాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు.సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో మంచి జీతం, ఉద్యోగ భద్రత, ప్రమోషన్ అవకాశాలు ఉండడం వల్ల రైల్వే ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఉంటుంది.

RRB NTPC & JE Recruitment 2025
RRB NTPC & JE Recruitment 2025

RRB NTPC & JE Recruitment Vacancy

Railway Recruitment Board (RRB) భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ కింద పనిచేసే అధికారిక నియామక సంస్థ. ఈ సంస్థ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ కింద గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు మరియు జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. మొత్తం 11,429 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  

గ్రాడ్యుయేట్ పోస్టులు : 5,810

పోస్టు పేరుఖాళీలు
చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్ వైజర్161
స్టేషన్ మాస్టర్615
గూడ్స్ ట్రైన్ మేనేజర్3,416
జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్921
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్638
ట్రాఫిక్ అసిస్టెంట్59

అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు : 3,050

  • అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 394
  • కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ – 2,424
  • జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 163
  • రైల్స్ క్లర్క్ – 77

జూనియర్ ఇంజనీర్ పోస్టులు

మొత్తం ఖాళీలు: 2,569

  • Junior Engineer (JE)
  • Depot Material Superintendent (DMS)
  • Chemical & Metallurgical Assistant (CMA)

Also Read : AIIMS Gorakhpur Non-Teaching Recruitment 2025 | AIIMS కొత్త నోటిఫికేషన్ – టెన్త్ నుండి డిగ్రీ వరకు అప్లై చేసుకోవచ్చు!

అర్హతలు(Eligibility) : 

RRB NTPC & JE Recruitment 2025 పోస్టును బట్టి అభ్యర్థుల విద్యార్హతలు మారుతాయి. 

  • గ్రాడ్యుయేట్ పోస్టులు :  ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ (Graduation) పూర్తి చేసి ఉండాలి. 
  • అండర్ గ్రాడ్యుయేట్ : 10+2 / ఇంటర్ పాస్
  • జూనియర్ ఇంజనీర్ :సంబధిత విభాగంలో ఇంజనీరింగ్ లో డిగ్రీ / డిప్లొమా

వయోపరిమితి(Age Limit) : 

RRB NTPC & JE Recruitment 2025 పోస్టును బట్టి అభ్యర్థుల వయోపరిమితి మారుతుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

  • గ్రాడ్యుయేట్ పోస్టులు :  18 – 33 సంవత్సరాలు 
  • అండర్ గ్రాడ్యుయేట్ : 18 – 30 సంవత్సరాలు
  • జూనియర్ ఇంజనీర్ : 18 – 33 సంవత్సరాలు

అప్లికేషన్ ఫీజు(Application Fees) :

RRB NTPC & JE Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.  

కేటగిరీఅప్లికేషన్ ఫీజురీఫండ్
జనరల్ / ఓబీసీ / EWSరూ.500/-CBT-1కి హాజరైన తర్వాత రూ.400 తిరిగి చెల్లిస్తారు.
SC /ST /PWD / ESM / EBC / మహిళలు / ట్రాన్స్ జెండర్ / మైనారిటీలురూ.250/-CBT-1కి హాజరైన తర్వాత పూర్తి ఫీజు రీఫండ్ చేస్తారు.

ఎంపిక ప్రక్రియ(Selection Process): 

RRB NTPC & JE Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది. 

గ్రాడ్యుయేట్ పోస్టులు : 

  • CBT-I (Online పరీక్ష)
  • CBT-II  కంప్యూటర్ ఆధారిత పరీక్ష
  • Typing Skill Test (Typist పోస్టులకు)
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ 
  • మెడికల్ టెస్ట్

అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT-1)
  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT-2)
  • కంప్యూటర్ ఆధారిత టైపింగ్ స్కిల్ టెస్ట్ (టైపిస్ట్ పోస్టులకు)
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ టెస్ట్

RRB JE

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT-I)
  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT-II)
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ ఎగ్జామినేషన్

Also Read : AgHub Recruitment 2025 | రూరల్ కోఆర్డినేటర్ జాబ్స్

జీతం వివరాలు(Salary Details) : 

RRB NTPC & JE Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి పే స్కేల్ మారుతుంది. కింద బేసిక్ పే వివరాలు కింద ఇవ్వబడ్డాయి.

గ్రాడ్యుయేట్ పోస్టులు

  • చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్ వైజర్ : రూ.35,400/-(పే లెవల్–6)
  • స్టేషన్ మాస్టర్ : రూ.35,400/-(పే లెవల్–6)
  • గూడ్స్ రైలు మేనేజర్ : రూ.29,200/-(పే లెవల్–5)
  • జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ : రూ.29,200/-(పే లెవల్–5)
  • సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ :రూ. 29,200/-(పే లెవల్–5)
  • ట్రాఫిక్ అసిస్టెట్ : రూ.25,500/-(పే లెవల్–4)

అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు

  • జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ : రూ.19,900 – రూ.63,200/-
  • అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ : రూ.19,900 – రూ.63,200/-
  • ట్రైన్స్ క్లర్క్ : రూ.19,900 – రూ.63,200/-
  • కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ : రూ.21,700 – రూ.69,100/-

RRB JE :

  • రూ.35,400 – రూ.1,12,400/- వరకు  

దరఖాస్తు విధానం(How to Apply) :  

RRB NTPC & JE Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • అప్లయ్ ఆన్ లైన్ లింక్ పై క్లిక్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • గ్రాడ్యుయేట్ పోస్టులకు చివరి తేదీ : 20 నవంబర్, 2025
  • అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు చివరి తేదీ : 27 నవంబర్,2025
  • జూనియర్ ఇంజనీర్ పోస్టులకు చివరి తేదీ : 30 నవంబర్, 2025

Graduate Notification : Click here

Apply Online : Click here

Under Graduate Notification : Click here

Apply Online : Click here

RRB JE Notification : Click here

Apply Online : Click here

Also Read : IAF AFCAT 01/2026 Notification | ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్

1 thought on “RRB NTPC & JE Recruitment 2025 | రైల్వేలో 11,429 ఉద్యోగాలు – అప్లయ్ చేశారా?”

Leave a Comment

Follow Google News