RRB NTPC & JE Recruitment 2025 : ఇండియన్ రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. Railway Recruitment Boards (RRBs) ద్వారా రైల్వే వివిధ జోన్ లలో మొత్తం 11,429 ఖాళీల కోసం నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ నియామకాల్లో ఇంటర్ (10+2), డిగ్రీ, అలాగే డిప్లొమా / ఇంజినీరింగ్ చదివినవాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు.సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో మంచి జీతం, ఉద్యోగ భద్రత, ప్రమోషన్ అవకాశాలు ఉండడం వల్ల రైల్వే ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఉంటుంది.

RRB NTPC & JE Recruitment Vacancy
Railway Recruitment Board (RRB) భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ కింద పనిచేసే అధికారిక నియామక సంస్థ. ఈ సంస్థ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ కింద గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు మరియు జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. మొత్తం 11,429 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
గ్రాడ్యుయేట్ పోస్టులు : 5,810
| పోస్టు పేరు | ఖాళీలు |
| చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్ వైజర్ | 161 |
| స్టేషన్ మాస్టర్ | 615 |
| గూడ్స్ ట్రైన్ మేనేజర్ | 3,416 |
| జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ | 921 |
| సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ | 638 |
| ట్రాఫిక్ అసిస్టెంట్ | 59 |
అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు : 3,050
- అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 394
- కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ – 2,424
- జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 163
- రైల్స్ క్లర్క్ – 77
జూనియర్ ఇంజనీర్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 2,569
- Junior Engineer (JE)
- Depot Material Superintendent (DMS)
- Chemical & Metallurgical Assistant (CMA)
అర్హతలు(Eligibility) :
RRB NTPC & JE Recruitment 2025 పోస్టును బట్టి అభ్యర్థుల విద్యార్హతలు మారుతాయి.
- గ్రాడ్యుయేట్ పోస్టులు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ (Graduation) పూర్తి చేసి ఉండాలి.
- అండర్ గ్రాడ్యుయేట్ : 10+2 / ఇంటర్ పాస్
- జూనియర్ ఇంజనీర్ :సంబధిత విభాగంలో ఇంజనీరింగ్ లో డిగ్రీ / డిప్లొమా
వయోపరిమితి(Age Limit) :
RRB NTPC & JE Recruitment 2025 పోస్టును బట్టి అభ్యర్థుల వయోపరిమితి మారుతుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
- గ్రాడ్యుయేట్ పోస్టులు : 18 – 33 సంవత్సరాలు
- అండర్ గ్రాడ్యుయేట్ : 18 – 30 సంవత్సరాలు
- జూనియర్ ఇంజనీర్ : 18 – 33 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీజు(Application Fees) :
RRB NTPC & JE Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
| కేటగిరీ | అప్లికేషన్ ఫీజు | రీఫండ్ |
| జనరల్ / ఓబీసీ / EWS | రూ.500/- | CBT-1కి హాజరైన తర్వాత రూ.400 తిరిగి చెల్లిస్తారు. |
| SC /ST /PWD / ESM / EBC / మహిళలు / ట్రాన్స్ జెండర్ / మైనారిటీలు | రూ.250/- | CBT-1కి హాజరైన తర్వాత పూర్తి ఫీజు రీఫండ్ చేస్తారు. |
ఎంపిక ప్రక్రియ(Selection Process):
RRB NTPC & JE Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
గ్రాడ్యుయేట్ పోస్టులు :
- CBT-I (Online పరీక్ష)
- CBT-II కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- Typing Skill Test (Typist పోస్టులకు)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ టెస్ట్
అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు :
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT-1)
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT-2)
- కంప్యూటర్ ఆధారిత టైపింగ్ స్కిల్ టెస్ట్ (టైపిస్ట్ పోస్టులకు)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ టెస్ట్
RRB JE :
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT-I)
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT-II)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
Also Read : AgHub Recruitment 2025 | రూరల్ కోఆర్డినేటర్ జాబ్స్
జీతం వివరాలు(Salary Details) :
RRB NTPC & JE Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి పే స్కేల్ మారుతుంది. కింద బేసిక్ పే వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
గ్రాడ్యుయేట్ పోస్టులు :
- చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్ వైజర్ : రూ.35,400/-(పే లెవల్–6)
- స్టేషన్ మాస్టర్ : రూ.35,400/-(పే లెవల్–6)
- గూడ్స్ రైలు మేనేజర్ : రూ.29,200/-(పే లెవల్–5)
- జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ : రూ.29,200/-(పే లెవల్–5)
- సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ :రూ. 29,200/-(పే లెవల్–5)
- ట్రాఫిక్ అసిస్టెట్ : రూ.25,500/-(పే లెవల్–4)
అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు :
- జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ : రూ.19,900 – రూ.63,200/-
- అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ : రూ.19,900 – రూ.63,200/-
- ట్రైన్స్ క్లర్క్ : రూ.19,900 – రూ.63,200/-
- కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ : రూ.21,700 – రూ.69,100/-
RRB JE :
- రూ.35,400 – రూ.1,12,400/- వరకు
దరఖాస్తు విధానం(How to Apply) :
RRB NTPC & JE Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- అప్లయ్ ఆన్ లైన్ లింక్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- గ్రాడ్యుయేట్ పోస్టులకు చివరి తేదీ : 20 నవంబర్, 2025
- అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు చివరి తేదీ : 27 నవంబర్,2025
- జూనియర్ ఇంజనీర్ పోస్టులకు చివరి తేదీ : 30 నవంబర్, 2025
Graduate Notification : Click here
Apply Online : Click here
Under Graduate Notification : Click here
Apply Online : Click here
RRB JE Notification : Click here
Apply Online : Click here
Also Read : IAF AFCAT 01/2026 Notification | ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్







Job